Breaking News

Friday, 29 August 2025

ఆరోగ్యంగా ఉండండి

డయాలిసిస్ చేసే సమయంలో శరీరంలోని రక్తాన్ని కిందున్న ఎర్ర ట్యూబ్ ద్వారా బయటకు తీసి, డయాలిసిస్ యంత్రంలో శుభ్రపరిచి, నీలి రంగు ట్యూబ్ ద్వారా తిరిగి శరీరంలోకి పంపిస్తారు. శరీరంలోని రక్తమంతా శుభ్రపరచడానికి సుమారుగా 4 గంటలు పడుతుంది. ఈ నాలుగు గంటలు శరీరాన్ని కదల్చకుండా ఉంచాలి...
ఈ ప్రక్రియ వారానికి మూడు సార్లు, నెలకు 12 సార్లు నిర్వహించాలి. ప్రతిసారీ 4 గంటలు, అంటే నెలకు 48 గంటలు, వెచ్చించాలి...
డయాలిసిస్ అవసరం లేని వారిలో, ఈ ప్రక్రియను, ఎలాంటి ప్రయాస & అసౌకర్యం లేకుండా, కిడ్నీలు రోజుకు 36 సార్లు వాటంతటవే చేస్తాయ్...
ఇది చదివిన తరువాత మిత్రులు.. అతిగా మద్యం సేవించక పోవడం, ధూమపానం చేయకపోవడం, బయట హోటళ్లలలో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే తినుబండారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, అధిక చక్కెర, మైదాతో తయారయ్యే పదార్థాలను చాలా చాలా మితంగా తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా శారీరక శ్రమ చేయడం వంటి ఉత్తమ జీవన శైలి అలవాట్లను అలవరచుకొంటే మంచిది. ఎందుకంటే ఇవి మన కాలేయం& కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన మార్గాలు. మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండండి..... 🙏

No comments:

Post a Comment

Comments System

blogger/facebook/disqus

Disqus Shortname

wpsmart-blogger-template